September 26, 2021

THECPMNEWS.com

Cricket.Politics.Movies

సచిన్ టెండూల్కర్ వల్లే వరల్డ్ కప్ గెలిచామంటున్న రైనా…!

Spread the love
Sachin is reason to win World cup
Sachin is reason to win World cup

Sachin is reason to win World cup సచిన్ టెండూల్కర్ ప్రస్తుత ఇండియన్ క్రికెట్ జట్టులో ఎంతో మందికి స్ఫూర్తి దాయకం. భారతదేశం గర్వించదగ్గ ఆటగాడు.

విషయంలోకి వస్తే ఈ మధ్య ఒక ఫేస్బుక్ లైవ్ చాట్ లో సురేష్ రైనా మాట్లాడుతూ ఆయనకు ఎంతగానో ఇష్టమైన ఆటగాడు సచిన్ టెండుల్కర్ అదేవిధంగా ఫుట్బాల్ లో Lionel Messi అని తెలియజేశారు.

వీరిద్దరూ ఎంతో అనుకువగా ఉంటారని చుట్టుపక్కల వారితో సభ్యతగా నడుచుకుంటారని. నిత్యం చుట్టుపక్కల వారిని ఉత్సాహపరుస్తూ నిరాడంబరంగా ఉంటారని సురేష్ రైనా వ్యాఖ్యానించారు.

(యువరాజ్ సింగ్ షాకింగ్ కామెంట్స్ ఆన్ ధోని || Yuvraj shocking comments on Dhoni)

క్రికెట్ విషయానికి వస్తే సచిన్ చేసిన రికార్డులు ఆయన గురించి మాట్లాడతాయి వన్డే మరియు టెస్ట్ క్రికెట్ లో అత్యధిక స్కోరు చేశారని వంద సెంచరీలు పూర్తి చేసిన ఏకైక ఆటగాడు అని కొనియాడారు.

అదేవిధంగా ఫుట్బాల్ విషయానికొస్తే Messi కూడా ఎన్నో GOAT (greatest of all time) నమోదు చేశారని.

అంతేకాకుండా వరుసగా ఆరుసార్లు Coveted Ballon d’Or అవార్డు ను గెలుచుకున్న ఏకైక ఆటగాడు అని కొనియాడారు.

సందర్భానుసారంగా రైనా మాట్లాడుతూ ప్రపంచంలో నువ్వు నెంబర్ వన్ ఆటగాడు ఉండొచ్చు కానీ ఆటగాడికి వినయం ఎంతో ముఖ్యమని తెలియజేశారు.

(డేవిడ్ వార్నర్ ని అభినందించిన అల్లు అర్జున్…! || Allu Arjun Appreciates Warner)

Sachin is reason to win World cup 2011 వరల్డ్ కప్ విషయానికి వస్తే సచిన్ టెండూల్కర్ తమకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచారని.

ఒక విధంగా సచినే తమ వరల్డ్ కప్ విజయానికి కారణమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆటగాళ్లు అందర్నీ నిత్యం ఉత్సాహపరుస్తూ, తను రెండో కోచ్గా ఇండియా టీం ను ముందుకు తీసుకెళ్లారు అంటూ కొనియాడారు.

ప్రతి రోజు తాజా వార్తల కోసం ఈ లింక్ ని క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు.

మాస్క్ లేకుండా బయటకు వస్తే…! సెక్షన్ 188, 269,270… అంతేకాకుండా…