September 26, 2021

THECPMNEWS.com

Cricket.Politics.Movies

పూర్తి టిక్ టాక్ స్టార్ గా మారిపోయిన డేవిడ్ వార్నర్… ఈసారి ఏ హీరో డాన్స్ వేసాడు తెలుసా…!

Spread the love
Mindblock TitTok by Warner couple

ఇప్పటికే టిక్ టాక్ లో టాలీవుడ్ అగ్ర హీరోల సాంగ్స్ కి డాన్స్ వేసి డేవిడ్ వార్నర్ బాగా పాపులర్ అయ్యాడు.

ఈ లాక్ డౌన్ సమయంలో క్రికెట్ మ్యాచ్లు లేకపోవడంతో సరదాగా చేస్తున్న వీడియోలు టిక్ టాక్ లో అప్లోడ్ చేయడం మొదలెట్టాడు.

వార్నర్ సన్రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ టీంలో ఆడతాడు కావున తెలుగు ఇండస్ట్రీ అగ్రహీరోల సాంగ్స్ కి డాన్స్ వేయడం ఈమధ్య మొదలెట్టాడు.

ఇప్పటికే అల్లు అర్జున్ నటించిన అలా వైకుంటపురం సినిమాలోని 2 సాంగ్స్ కి టిక్ టాక్ వీడియో కి స్పందన బాగా వచ్చింది ఏకంగా తన ట్విట్టర్ అకౌంట్ ఫాలోవర్స్ ని అమాంతం పెంచేసింది.

అంతేకాకుండా ఎన్టీఆర్ బర్త్డేకి జూనియర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ సినిమా లోని పక్కా లోకల్ సాంగ్కి కూడా చేయడం జరిగింది.

దీంతో మహేష్ అభిమానులు కొందరు డేవిడ్ వార్నర్ ని మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు లోని సాంగ్ కి టిక్ టాక్ వీడియో చేయమని కోరడంతో ఈసారి మైండ్ బ్లాక్ సాంగ్ వీడియో చేసి పూర్తి టిక్ టాక్ స్టార్ గా మారిపోయాడు.

>>>>>Whats APP Group<<<<