September 26, 2021

THECPMNEWS.com

Cricket.Politics.Movies

Good Morning…Cricket news ||గుడ్ మార్నింగ్… క్రికెట్ న్యూస్

Spread the love
Happy birthday Sachin Tendulkar

Happy birthday Sachin Tendulkar : ముందుగా 47 వ పుట్టినరోజు జరుపుకుంటున్న సచిన్ టెండూల్కర్ కు జన్మదిన శుభాకాంక్షలు.

వార్తల్లోకి వస్తే ఇండియా ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ సిరీస్ ఓకే మైదానంలో జరగడాన్ని తను సమర్థించు ను అంటున్న సచిన్ టెండూల్కర్.

కరోనా వైరస్ ప్రభావం వల్ల అన్ని క్రికెట్ బోర్డులు ఆర్థికంగా బాగా నష్టపోయారు. ఈ ఏడాది చివర్లో ఇండియా ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ను క్లోజ్డ్ డోర్స్ మధ్య నడిపించాలి అనుకుంటున్నాయి.

అంటే ప్రేక్షకులు లేకుండా డోర్లు మూసేసి టెలి ప్రసారాలకుకు మాత్రమే పరిమితం చేస్తూ, అయితే దీనికి సచిన్ టెండూల్కర్ వద్దు అని తన నిర్ణయాన్ని వ్యక్తపరిచారు .

ఎందుకనగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు కూడా ఐదు టెస్ట్ మ్యాచ్ లు ఒకే మైదానం అయితే వాళ్లు కూడా home quarantine కి వచ్చినట్లు ఉంటుంది అని పేర్కొన్నారు.

వేలంలో భారీ మొత్తం పలికిన షకీబ్ అల్ హసన్ బ్యాట్.

ఈ మధ్య క్రికెటర్లు వారి బాట్లు , జెర్సీ లు, వేలం వేసి ఆ మొత్తాన్ని సేవా సంస్థలకు లేదా కరోనా వైరస్ సహాయార్థం ఇవ్వడం జరుగుతోంది.

ఇప్పటికే ఇంగ్లాండ్ ఆటగాడు buttler,కేఎల్ రాహుల్ తమ వస్తువులను వేలం వేయడం తెలిసిన విషయమే కొత్తగా షకీబ్ అల్ హసన్ కూడా ఈ జాబితాలో చేరారు.

న్యూయార్క్కు చెందిన బంగ్లాదేశ్ వాసి అయిన ఆరిఫ్ ఈ బ్యాట్ ని 24 వేల డాలర్లకు కొన్నట్లు సమాచారం.

ధోని ఇక డౌటే అంటున్న హర్భజన్ సింగ్.

Lockdown ప్రభావంవల్ల ఈమధ్య క్రికెటర్లు ఒకరినొకరు ఇంటర్వ్యూ చేసుకోవడం ఆ వీడియోను సోషల్ మీడియాలో అభిమానుల కోసం వదులుతున్నారు.

రోహిత్ శర్మ హర్భజన్ సింగ్ ఇంస్టాగ్రామ్ చాట్ లు మాట్లాడుకుంటున్నప్పుడు హర్భజన్ సింగ్ ఈ విధంగా తెలిపారు.

నేను ధోనిని చివరగా వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ న్యూజిలాండ్ తోనే “ఈ మధ్య కొందరు చెన్నై వాసులు dhoni గురించి అడగ్గా నాకు తెలియదు అది మీరు అతన్ని అడగాలి అంటూ సమాధానం ఇచ్చారు.”

నాకు తెలిసి అతను ఇండియా బ్లూ జెర్సీ వేసుకోడు ఐపీఎల్ మాత్రం ఆడుతాడు అని తన అభిప్రాయాన్ని చెప్పాడు.

అంతేకాకుండా ఇండియన్ టీం లో మిడిల్ ఆర్డర్ లు మరియు లోవర్ ఆర్డర్లు ప్రదర్శన సరిగ్గా లేదని పేర్కొన్నారు.

ఓపెనర్లు మరియు విరాట్ కోహ్లీ అవుటైన తర్వాత 70% మ్యాచ్లు ఇండియా ఓడిపోతుంది అని చెప్పారు.

అంతేకాకుండా రోహిత్ మరియు విరాట్ కోహ్లీని ఇండియన్ టీం కీలకమైన ప్లేయర్లను చెప్పాడు. ఇప్పట్లో కేఎల్ రాహుల్ కూడా ఏ స్థానంలో ఆయన తనదైన ప్రదర్శన ఇస్తున్నారని ఇంకొంతమంది ప్లేయర్లు నిలకడగా ఆడితే ఇండియా టీం మెరుగు పడుతుంది అని చెప్పాడు.

ఆస్ట్రేలియా తో టెస్ట్ మ్యాచ్ ఈజీ కాదు అంటున్న రోహిత్ శర్మ.

2018 19 లో జరిగిన టెస్ట్ సిరీస్లో ఇండియా 2-1 తో ఆస్ట్రేలియాపై విజయాన్ని సాధించింది.

ఈసారి జరిగే టెస్ట్ సిరీస్ కి వార్నర్ మరియు స్మిత్ రావడంతో మ్యాచ్ కొంచెం చాలెంజ్ గానే ఉంటుంది అనేసి రోహిత్ శర్మ అభిప్రాయ పడ్డాడు.

గాయం కారణంగా నేను ఈ టెస్ట్ మ్యాచ్ ఆడ లేక పోతున్నాను అందుకు బాధగా ఉంది అని రోహిత్ అన్నారు.

Finally Happy birthday Sachin Tendulkar again

ప్రతి రోజు తాజా వార్తల కోసం ఈ లింక్ ని క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు.